మంచు విష్ణు కొత్త చిత్రం ఖరారైంది. ‘గాలి నాగేశ్వరరావు’ పేరుతో రూపొందించబోతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తారు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి జి.నాగేశ్వర రెడ్డి మూల కథనందించారు. శుక్రవారం మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తన క్యారెక్టర్ గెటప్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విభిన్నమైన పాత్రలో మంచు విష్ణు కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, సంభాషణలు: భాను, నందు, సంగీతం: అనూప్‌రూబెన్స్.