Manchu Vishnu – Jenilia | టాలీవుడ్లో మళ్లీ రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గత శుక్రవారం రీ రిలీజైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం థియేటర్లో సందడి చేస్తుంది. అయితే తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం రీ రిలీజ్ సిద్దమవుతుంది. మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘ఢీ’. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించగా.. కొన వెంకట్, గోపి మోహన్ కథను అందించారు. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, మంచు విష్ణు కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా వచ్చిన 18 ఏండ్ల తర్వాత మార్చి 28న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకున్నాడు మంచు విష్ణు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన జీవితంలో ఎటువంటి లక్ష్యం లేకుండా సరదాగా గడిపే యువకుడు బబ్లూ (మంచు విష్ణు). అయితే బబ్లూ చేసే అల్లరి పనుల వల్ల అతడి తండ్రి నారాయణ (చంద్రమోహన్) ఎప్పుడు ఇబ్బందులు పడుతుంటాడు. ఇక బబ్లూని మార్చుదాం అనుకున్న నారాయణ అతడిని లోకల్ డాన్ అయిన శంకర్ గౌడ్ (శ్రీహరి) దగ్గర పనిలో పెడతాడు. అయితే శంకర్ గౌడ్లో పనిలోకి దిగిన బబ్లూ కొద్దిరోజులకే అతడి చెల్లెలు పూజ (జెనీలియా)తో ప్రేమలో పడతాడు. శంకర్ గౌడ్కి తెలియకుండా సినిమాలకు కూడా వెళతారు. అయితే తన చెల్లికి ప్రాణ భయం ఉందని తెలుసుకున్న శంకర్ గౌడ్ పెళ్లి చేసి పూజని విదేశాలకు పంపిద్దాం అనుకుంటాడు. ఇది తెలిసిన బబ్లూ తన ప్రేమను ఎలా కాపాడుకున్నాడు. శంకర్ గౌడ్ని బబ్లూ పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘Hooray’ pic.twitter.com/HAJdITUWfR
— Vishnu Manchu (@iVishnuManchu) March 8, 2025