Spirit Movie Team Announcement for Casting Call | అగ్ర కథానాయకుడు ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit). దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారిని డిజిటల్ ఆడిషన్స్‌కి పిలిచింది సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ అయిన భద్రకాళీ పిక్చర్స్. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నామని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆడిషన్స్‌లో పాల్గోనవచ్చని తెలిపింది. అయితే ఆడిషన్స్‌లో పాల్గోనేవారు సినిమా లేదా థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు అయి ఉండాలని తెలిపింది.
అయితే ఈ ఆడిషన్‌కి దరఖాస్తు చేసుకున్నాడు టాలీవుడ్ నటుడు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ ‘స్పిరిట్’ కాస్టింగ్ కాల్కి నేను కూడా అప్లయ్ చేశాను. ఏం జరుగుతుందో చూడాలి అని విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025