మంచు లక్ష్మి త్వరలో జ్వాలగా దర్శనమివ్వనున్నది. ‘యక్షిణి’ వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర పేరు ‘జ్వాల’. గురువారం మేకర్స్ ఆమె లుక్‌ని విడుదల చేశారు. నిండుగా చీరకట్టుకుని ఓ పాడుబడ్డ మహల్ మధ్యలో నిలబడి గంభీరంగా నవ్వుతూ ఉన్న మంచులక్ష్మిని ఈ లుక్‌లో చూడొచ్చు.
సరికొత్త అనుభూతిని పంచేలా ఫాంటసీ, కామెడీ, రొమాన్స్ అంశాలతో ఈ సిరీస్ రూపొందించబడిందని దర్శకుడు తేజ మార్ని చెప్పారు. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ని భారీ నిర్మాణ విలువలతో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ప్రముఖ ఓఓటీ ప్లాట్‌ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.