Manchi Rojulochaie Premiers | ‘మంచి రోజులు వచ్చాయి’ ప్రీమియర్స్ హౌస్‌ఫుల్
ఈ రోజుల్లో సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంత చిన్న విషయం కాదు. చిన్న సినిమాలకు అసలు ఇది సాధ్య పడదు. అయినా కూడా మంచి రోజులు వచ్చాయి (Manchi Rojulochaie) సినిమా విషయంలో అద్భుతాలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి.

ఈ రోజుల్లో సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంత చిన్న విషయం కాదు. చిన్న సినిమాలకు అసలు ఇది సాధ్య పడదు. అయినా కూడా మంచి రోజులు వచ్చాయి (Manchi Rojulochaie) సినిమా విషయంలో అద్భుతాలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి (Maruthi), సంతోష్ శోభన్ (Santhosh Shobhan) రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ సంచలనం రేపుతున్నాయి.
అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రీమియర్స్ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం గమనార్హం. వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో నవంబర్ 3 రాత్రి పేయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్‌పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ సూపర్ ఫాస్టుగా అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా ప్రీమియర్స్‌కు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. మారుతిపై నమ్మకంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికి హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్‌తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు.
ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్ బ్యానర్, ఎస్కేఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు ప్రీమియర్స్ అన్నీ హౌజ్ ఫుల్ అవుతుండటం శుభ పరిణామం. దాంతో భారీ అంచనాల మధ్య దీపావళికి మంచి రోజులు వచ్చాయి విడుదలవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

