బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం60వ ఎసిపోడ్కి చేరుకుంది. ముందు ఎపిసోడ్ లో అనీ మాస్టర్ తనకు దక్కిన స్పెషల్ పవర్‌తో మానస్‌ని సేవ్ చేశాడు.దీనిపై శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాలా సార్లు నేను మిమ్మల్ని సేవ్ చేశాను, నన్ను సేవ్ చేయమని కూడా అడగడం లేదు, అతనిని ఎలా సేవ్ చేశారంటూ ఆందోళన చెందుతూ కనిపించాడు శ్రీరామ్.
కాజల్, మానస్ కూర్చుని ఉండగా.. మానస్ తప్పుగా అనుకోనంటే ఒకటి చెప్తా.. పింకీ మానస్ అనే జోన్ దాటి వెళ్లడం లేదు.. నిన్న నైట్ వెళ్లి ఆమెకు చెప్పాను నీ ఆట నువ్ ఆడు అని.. చాలామంది అంటున్న మాట ఇదే.. పింకీకి మానస్ అంటే ఇష్టం ఉంది.. అలాగే గేమ్ ఆడుతుంది అని సన్నీ అన్నాడు.
దీనిపై స్పందించిన మానస్.. ‘నేను ఈ మాట ఆమెకు రెండు వారాలుగా చెప్తున్నా.. పింకీ మైండ్ ఎలాంటిదంటే.. తనకు ఏది అనిపిస్తే అదే చేస్తుంది.. ఎవరు చెప్పినా వినదు.. విన్నట్టుగా నటిస్తుంది తప్పి తరువాత పోరా బచ్చా అని అనుకుంటుంది అని చెప్పాడు మానస్. నేను ఆమె గేమ్‌ని డిస్ట్రబ్ చేయడం లేదు.. తననీ డిస్ట్రబ్ చేయడం లేదు అన్నాడు మానస్.