Mammootty | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). ఇటీవలే ఏజెంట్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు మమ్ముట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ స్టార్ హీరో కొత్త సినిమాకు సంబంధించి క్రేజీ వార్త బయటకు వచ్చింది. మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక (Bazooka). గేమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ అయింది. బెంగళూరు, కోచి ప్రాంతాల్లో 90 రోజులకుపైగా షూటింగ్ కొనసాగనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రం స్టైలిష్గా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన లుక్తో తెలిసిపోతుంది. ఈ ఏడాది మమ్ముట్టి నటించిన క్రిస్టోఫర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే మమ్ముట్టి చేతిలో మూడు సినిమాలుండగా.. ఒకటి షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
Bazooka
Megastar #Mammootty ‘s upcoming movie #Bazooka starts filming today. @mammukka @YoodleeFilms @menongautham #DennoDennis #JinuVAbraham pic.twitter.com/coH2Ogz7aX
— Ramesh Bala (@rameshlaus) May 10, 2023