Bazooka – Mammotty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చాలా రోజుల తర్వాత మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బజూక’(Bazooka). ఈ సినిమాకు దీనో డెన్నిస్ దర్శకత్వం వహిస్తుండగా.. థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై డేవిన్ కురియకోస్, జిను వి అబ్రహం, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను చూస్తే ఇది సీరియల్ కిల్లర్‌ను చేధించే కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్లో మమ్ముట్టి స్టైలిష్ లుక్‌లో, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలతో కనిపించారు.