Mohan Lal | సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌పై మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ ప్రశంసల జల్లు కురిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆడుకాలం’ సినిమా ఆడియో వేడుక కేరళలోని కొచ్చీలో ఘనంగా జరిగింది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి మోహన్‌లాల్ ముఖ్యఅతిథిగా హాజరై రెహమాన్‌తో తన అనుబంధాన్ని నెమరువేసుకుంటూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు.
‘నటుడిగా నా జీవితంలో అత్యధిక ప్రశంసలందుకున్న సినిమా ‘ఇరువర్’. ఇందులోని పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనేవున్నాయి. 30ఏళ్ల క్రితం వచ్చిన నా ‘యోధ’ సినిమాకు కూడా తనే సంగీతం అందించారు. ఆ పాటలు వింటుంటే రెహమాన్‌ను చూస్తున్నట్టే ఉంటుంది. అంత గొప్ప సంగీతం ఇచ్చాడు. అంతేకాదు ‘ఆరాట్టు’ సినిమాలో మేమిద్దరం కలిసి నటించాం.
నాకు సంగీత దర్శకుడిగానే కాదు, వ్యక్తిగా కూడా రెహమాన్ అంటే ఇష్టం. నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరని గర్వంగా చెబుతా. ఆయన తండ్రి ఆర్.కె.శేఖర్‌గారు మలయాళంలో 23 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. దాదాపు 500 సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పుడు రెహమాన్ కూడా మలయాళ సినిమాకు మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు మోహన్‌లాల్. ‘ఆడు జీవితం’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 28న విడుదల కానుంది.