Sarath Chandran Passes Away | సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ నటుడు శరత్ చంద్రన్(37) శుక్రవారం మృతి చెందాడు. కారణం ఏంటో తెలియదు గాని కొచ్చిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. ఈయన మరణం పట్ల మలయాళ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ప్రముఖ మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ సోషల్ మీడియా ద్వారా శరత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
శరత్ సినిమాల్లోకి రాకముందు ఐటీ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. సినిమాలపై ఉన్న ఆసక్తితో జాబ్‌ను వదిలేసి అవకాశాల బాట పడ్డాడు. మొదట డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. అలా డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి ‘అనిస్య’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘అంగమళై డైరీస్’, ‘ఒరు మెక్సికన్ అపరత’, ‘కూడే’ వంటి సినిమాలతో మాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.