నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తుండటంతో వినూత్నరీతిలో ప్రమోషన్‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 14న చారిత్రక వరంగల్ నగరంలో నిర్వహించబోతున్నట్లు నిర్మాత వెంకట్ బోయనపల్లి తెలిపారు. ‘వరంగల్‌లోని రంగలీల మైదానంలో భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నాం. హీరో నానితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ ఈ వేడుకలో భాగమవుతారు’ అని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెలిపారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్, కథ: సత్యదేవ్ జంగా, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.