డబ్బు కోసం చేసిన సినిమా కాదు

‘ముంబయి ఉగ్రదాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫొటో చూడగానే సొంత అన్నయ్యను కోల్పోయిన ఫీలింగ్ కలిగింది. ఆయన కళ్లలో ఉన్న తపన, పట్టుదల ముఖంలోని నవ్వు నాలో స్ఫూర్తిని నింపాయి. సందీప్‌కు అభిమానిగా మారిపోయా. ఆయన జీవిత కథను చెప్పాలనే ఆలోచనతో ఈ సినిమా చేశా’ అని అన్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్కా దర్శకుడు.జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్,ఏప్లస్ ఎస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శోభిత ధూళిపాళ్ల, సయి మంజ్రేకర్ కథానాయికలు. ఈ చిత్ర తెలుగు టీజర్‌ను సోమవారం మహేష్‌బాబు విడుదలచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అడివిశేష్ మాట్లాడుతూ ‘నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. డబ్బు, పేరు కోసం ఆలోచించకుండా మనస్ఫూర్తిగా చేసిన మంచి సినిమా ఇది.
మాస్, క్లాస్ అనే విభజనలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. మేజర్ సందీప్ జీవితంలోని ఆత్మను యథాతథంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కించాం. సోని పిక్చర్స్ సినిమాలో భాగం కావడంతో అంతర్జాతీయ స్థాయి సినిమాగా మారింది. ఈ సినిమా విషయంలో మహేష్‌భాబు, నమ్రత చక్కటి సలహాలు అందించారు’ అని తెలిపారు. అందరూ గర్వపడే సినిమా ఇదని, చక్కటి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుందని నిర్మాతలు చెప్పారు. ‘నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది’ అని దర్శకుడు శశికిరణ్ తిక్కా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయి మంజ్రేకర్, శోభిత పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
అన్నీ అబద్ధాలే.. ఓటీటీలోకి వకీల్ సాబ్ అప్పుడే రాదు
ఇట్స్ ఆఫీషియల్.. కొరటాల శివతో మరోసారి ఎన్టీఆర్
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

