టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోలో పోషించిన చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీతో తొలిసారి నార్తిండియన్ బాక్సాపీస్ లోకి ఎంటరయ్యాడు. శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేసిన మేజర్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ (Saimanjrekar) హీరోయిన్గా నటించింది.
మేజర్ విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నట్టు ఎప్పటికపుడు వస్తున్న కలెక్షన్లు చెబుతున్నాయి. తాజాగా ఈ చిత్రం హిందీ వెర్షన్ ఎంత కలెక్షన్లు రాబట్టిందనే దానిపై ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. మేజర్ హిందీ వెర్షన్ ఇప్పటివరకు రూ.10.40 కోట్లు వసూళ్లు రాబట్టింది. హిందీలో అడివిశేష్ లాంటి కొత్త హీరో ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం గొప్ప విషయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
#Major [Week 2] Fri 36 lacs, Sat 63 lacs, Sun 85 lacs, Mon 31 lacs, Tue 31 lacs, Wed 31 lacs. Total: ₹ 10.40 cr. #India biz. Nett BOC. #Hindi version. pic.twitter.com/AssPTxRrO6
— taran adarsh (@taran_adarsh) June 16, 2022
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది.
Read Also : Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్