Save The Tigers 4 | తెలుగులో సక్సెస్ఫుల్ ప్రాంచైజీగా తెరకెక్కి ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్న వెబ్ సిరీస్‌లలో టాప్‌లో నిలుస్తుంది సేవ్ ది టైగర్స్ (Save the Tigers). ఇప్పటికే రెండు పార్టులు సూపర్ హిట్ తెచ్చుకోగా.. ప్రదీప్ అద్వైతం, మహి వీ రాఘవ్ క్రియేషన్‌లో శ్రీరామ్ ఎరగం డైరెక్షన్లో తెరకెక్కిన సేవ్ ది టైగర్స్ సీజన్ 3 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్ స్టార్‌లో జూన్ 19 ప్రీమియర్ అయి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రియదర్శి, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, కామాక్షి భాస్కర్ల అండ్ వెన్నెల కిషోర్ టీం అందిస్తున్న ట్రిబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్కు అంతా ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ వినోదాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు నాలుగో పార్ట్ కూడా రాబోతుందన్న వార్త మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. మహి వీ రాఘవ్ టీం నాలుగో సీజన్‌కు ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. మూడో పార్టులో వెన్నెల కిశోర్ యాడ్ అయ్యాడని తెలిసిందే. అయితే నాలుగో సీజన్లో ఏకంగా ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
అంటే నాలుగో సీజన్లో మూడు జంటలతోపాటు స్టార్ హీరో కూడా ఎంటర్టైన్ చేయబోతున్నాడన్నమాట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తబోతుందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి నాలుగో సీజన్‌ను మహి వీ రాఘవ్ డైరెక్ట్ చేస్తాడా..? కొత్త దర్శకుడు ఎవరైనా టేకోవర్ చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.