Sarkaru Vaari Paata On Ott | మహేష్‌బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. కాగా ఈ చిత్రం జూన్ 2 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘పే పర్ వ్యూ’ పద్థతిలో స్ట్రీమింగ్ అవుతుంది.
అయితే గత రాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ సబ్స్క్రిబ్షన్ ఉన్న వాళ్ళు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా చూడవచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ సినిమాకు ముస్తాబవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై మొదటివారంలో షూటింగ్ మొదలు పెట్టనుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.