హైదరాబాద్: బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌ను టాలీవుడ్ కథానాయకుడు ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతకుముందు ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఫర్హాన్ అక్తర్ ఆకర్షించారు. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘తుపాన్’అనే చిత్రం బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. అందులో బాక్సర్‌గా కనిపించేందుకు ఆయన తన దేహ దారుఢ్యాన్ని మలుచుకున్న తీరు సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్య చకితులను చేసింది.
అందుకే ఫర్హాన్‌పై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫర్హాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘తుపాన్ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ పాత్రకోసం ఫర్హాన్ అక్తర్ సన్నద్ధమైన తీరు నమ్మశక్యంగా లేదు. తానేమిటో ఫర్హాన్ మరోసారి నిరూపించారు. నాకు త్వరగా ఈ చిత్రాన్ని చూసేయాలని ఉంది! అంటూ ‘తుపాన్ ’టీజర్ లింక్‌ను పోస్ట్ చేశారు.
ఇంతకు ముందు ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో కూడా ఫర్హాన్ రిప్పిడ్ బాడీతో ఒక ఆథ్లెట్కు ఉండే ఆహార్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘తుపాన్’లో ఫర్హాన్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఒక పాత్ర కోసం నటులు ఎంతగా శ్రమిస్తారో స్పష్టం అవుతున్నది. కాగా, ఫర్హాన్‌ను ఇంతకుముందు బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా మెచ్చుకున్న సంగతి తెలిసిందే!