సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి మనందరికి తెలిసిందే. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు కుటుంబసభ్యులతో విహారయాత్రలకు తరచూ వెళుతుంటారు. ఇటీవల సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ కోసం గోవా వెళ్లిన మహేష్ తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు.నమ్రత, సితార, గౌతమ్‌తో పాటు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ, మంజుల పలువురు స్నేహితులు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో గోవా వెళ్లారు.
గోవా టూర్‌కి సంబంధించిన విశేషాలు,అక్కడ జరిగిన ఫన్ ఇన్సిడెంట్స్‌ని ఓ వీడియోగా రూపొందించారు.ఈ వీడియోని ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో ఆద్య,సితార నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ వీడియోని మహేష్ తన ట్విట్టర్లో షేర్ చేస్తూ నెటిజన్స్ కి పసందైన వినోదం అందించాడు. ఈ వీడియోలో బాతులని చూసి ఆద్య, సితార పరుగెత్తడం నవ్వు తెప్పిస్తుంది.
గోవాలో 2 వారాల పాటు జరిగిన సుదీర్ఘ షెడ్యూల్లో దర్శకుడు పరశురామ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మహేష్, కీర్తిలతో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరుగుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.
To how it all began! My favourite duo is back.. taking us through Goa this time! Loved the video as always! Rock on my girls 🤗🤗🤗 #AadyaAndSitara pic.twitter.com/XS4MELMEbU
— Mahesh Babu (@urstrulyMahesh) August 28, 2021