సూపర్ స్టార్ మహేష్ బాబు 46 ఏళ్ల వయస్సులోను కుర్రాడిలా కనిపిస్తున్నారు. బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా ఎందరో మనసులని గెలుచుకున్నాడు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో నమ్రతతో కలిసి నటించిన మహేష్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్ల ప్రేమయాణం తర్వాత ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ప్రస్తుతం మహేష్, నమత్ర దంపతులకు గౌతమ్, సితార అనే చిన్నారులు ఉన్నారు.
ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత, మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, మహేష్ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన శ్రీమతితో దిగిన క్యూట్ పిక్ షేర్ చేసిన మహేష్.. నమత్రని సూపర్ ఉమెన్ అంటూ పేర్కొనడం విశేషం.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సై అన్న మహేష్ బాబు ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Superstar @urstrulyMahesh & #NamrataGhattamaneni are giving us a Major Couple goals Inspiration
— BA Raju's Team (@baraju_SuperHit) October 4, 2021
Check out Few Dapper Stills of this Super Couple from @hellomagindia Shoot @jatinkampani @grtjewellers@nayareali1 #Anisha #AmberTikari #MaheshBabu #SSMB pic.twitter.com/OzvMQAz9h5