Mahesh Babu | ఎన్ని అడ్డంకులు వచ్చినా చెప్పిన డేట్‌కు కచ్చితంగా రావాలని గుంటూరు కారం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రోజులు లెక్కపెట్టుకుంటూ షూటింగ్‌ను నిర్విరామంగా జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో యూత్ సహా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఏందట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా అంటూ గ్లింప్స్‌తో అభిమానుల్లో వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు. అతడు, ఖలేజా వంటి క్లాసిక్ హిట్స్ రానుండటం, అది కూడా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అవడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందని తెలుస్తుంది. ఎనిమిది రోజుల పాటు భారీ యాక్షన్ సీన్‌ను ఈ ఫ్యాక్టరీలో జరపుతున్నారట. రామ్-లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ సీన్ సినిమాలోనే హైలెట్ కానుందట. ఈ ఫైట్ సీన్ వచ్చినప్పుడు ఒక్కరు కూడా సీట్లలో కూర్చోరని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో మహేష్ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే సీన్లు పుష్కలంగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. పేరుకు ఫ్యామిలీ కథనే తీసుకున్నా.. అభిమానులను సాటిస్ ఫై చేసే స్టఫ్ పుష్కలంగా ఉందని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా మహేష్‌ను ఈ సినిమాలో సరికొత్త అవతారంలో మాస్ హీరోగా చూడబోతున్నామట.
శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. థమన్ స్వరాలందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్‌పై వర్క్ కూడా స్టార్ట్ చేశాడట. వీలైనంత త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్లు వేస్తున్నారట.