సర్కారు వారి పాట విషయంలో ఆ రిస్క్ వద్దు అంటున్న మహేశ్‌బాబు..

sarkaru vaari paata | సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఈ మధ్య స్పెయిన్‌లో మహేశ్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగింది. షూటింగ్లో భాగంగా ఆయనకు గాయం కావడంతో.. అది పెద్దది కాకుండా సర్జరీ వరకు వెళ్లారు మహేశ్ బాబు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నాడు. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నాడు సూపర్ స్టార్. రెండు నెలల తర్వాత ఇండియాకు రావాలని చూస్తున్నారు. పనిలో పనిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా దుబాయ్‌లోనే ప్లాన్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం కుటుంబంతో పాటు అక్కడే ఉన్నాడు ఈ హీరో.
సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తయింది. క్లైమాక్స్ చిత్రీకరణ మాత్రం బాకీ ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మహేశ్ బాబు సంతృప్తిగా లేడని.. అందుకే పరశురామ్ అండ్ టీం మరోసారి క్లైమాక్స్ విషయంలో కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగు మరో రెండు నెలల వరకు మహేశ్ బాబు రెస్ట్ తీసుకుంటాడు.. ఆ లోపు పర్ఫెక్ట్ క్లైమాక్స్ ప్లాన్ చేయాలని చూస్తున్నాడు పరశురామ్. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు అలాగే ఉన్నాయి. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 120 కోట్ల వరకు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం మహేశ్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ మధ్య చాలా మంది హీరోలు తమ సినిమాల్లో కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. కానీ సర్కారు వారి పాట విషయంలో నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కేవలం తెలుగు వరకు మాత్రమే వాళ్లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే చేరువయ్యేలా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనవసరంగా రిస్క్ తీసుకొని అన్ని భాషల్లో విడుదల చేసి ఆ తర్వాత ఫలితాలను చూసి బాధపడటం కంటే.. ముందుగానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్నారు మహేశ్ బాబు అండ్ టీం. ఏప్రిల్ 1, 2022న ఈ సినిమా విడుదల కానుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Keerthy Suresh New Talent | కొత్త టాలెంట్ చూపించబోతున్న కీర్తిసురేశ్..!
Maheshbabu | సర్కారు వారి పాటకు మహేష్‌బాబు పారితోషికం తెలుసా?
Parasuram | పరశురాం మేకింగ్ తో ఇబ్బంది పడుతున్న మహేశ్ బాబు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

