Mahesh Babu | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫిట్ నెస్ మంత్రను ఫాలో యాక్టర్లకు కొదవేవి లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మొదటి స్థానంలో ఉంటాడు. తన డైలీ టైం టేబుల్లో వర్కవుట్ సెషన్ తప్పకుండా ఉండేలా చూసుకునే మహేశ్ బాబు ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్‌లో యంగ్‌గా కనిపిస్తూ.. అందరినీ మెస్మరైజ్ చేస్తుంటాడని తెలిసిందే. తాజాగా అలాంటి స్టిల్‌ను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
జిమ్ ట్రైనర్‌తో కలిసి దిగిన స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..The beast recipe అంటూ క్యాప్షన్ ఇచ్చాడు మహేశ్ బాబు. ఈ సారి మరింత యంగ్‌గా మెరుస్తూ యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. బ్లాక్ జిమ్ వేర్లో ప్రిన్స్ సూపర్ ఛామింగ్ లుక్ ఇప్పుడు మూవీ లవర్స్, అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నాడు.
జిమ్ సెషన్లో మహేశ్‌బాబు..
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ గ్యారంటీ చెని చెప్పకనే చెప్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
గుంటూరు కారం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్ బాబు మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేయబోతున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..