Mahesh Babu | ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి సినిమా కోసం మారిన మహేశ్‌బాబును చూసి, చేతుల్లో ఉన్న సెల్ఫోన్లకు పనిచెప్పేశారు జనాలు. లాంగ్ హెయిర్, పెరిగిన గడ్డం, టైట్‌గా ఉన్న టీషర్ట్లోంచి కనిపిస్తున్న తిరిగిన కండలు వీటికితోడు నల్లకళ్లాద్దలు.. స్టయిల్‌గా నడుస్తూవచ్చి కారెక్కుతున్న సూపర్‌స్టార్‌ని చూసి అభిమానులు పులకించిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజా అప్డేట్ ఏంటంటే.. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులోని ఓ పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉంటుదని సమాచారం.
అమేజాన్ అడవుల నేపథ్యంలో ఈ పాత్రే కీలకంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. మరో పాత్రలో ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తారట మహేశ్‌బాబు. ఈ సినిమా ఆర్టిస్టుల ఎంపిక కోసం టెస్ట్ షూట్ జరుగుతున్నది. కథ కూడా లాక్ అయ్యింది. ప్రస్తుతం డైలాగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇందులో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారట. అలాగే హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. ఆగస్టులో మ్యూజిక్ వర్క్ మొదలుపెడతానని ఇటీవలే కీరవాణి ప్రకటించారు. ఇందులో ఓ హీరోయిన్గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్టు వినికిడి.