Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న మూవీతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29 ఇటీవల ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది.
చిత్రంలో మహేష్ బాబు పాత్ర రామాయణంలోని హనుమంతుడి నుండి స్ఫూర్తి పొందినట్లుగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైన మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి రానున్న రోజులలో మహేష్ బాబు తన పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారని అర్ధం అవుతుంది. ఇక మీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకునే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆయన చేయనటువంటి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ను చేయాలని కోరుకుంటున్నారు
మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కోరుకుంటున్నారు. వారందరు కూడా మహేష్ బాబు పాత్ర విషయంలో కొంత దృష్టి పెట్టి సూపర్ స్టార్‌ని మెప్పిస్తే ఇక తిరుగుండదు. ఇప్పుడు స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ప్రూవ్ చేసుకోవాలని చాలా తాపత్రయపడుతున్నారు. మహేష్ బాబు సైతం వాళ్ళందరికి పోటీని ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు తన పాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు అర్ధమవుతుంది