Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఇటీవలే గుంటూరు కారం నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఫీల్ అందిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు నిర్మాత నాగవంశీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో థ్రిల్లింగ్ అప్డేట్ అందించారు. వచ్చే వారం రెండో పాటను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ చిత్రంలో మొత్తం 4 పాటలుండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.
గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు నుంచి అభిమానులు ఆశిస్తున్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే మహేశ్‌బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, జగపతిబాబుపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు అప్డేట్ వచ్చిందని తెలిసిందే.
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..