శ్రీమద్భాగవతం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాదాపు 300కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై రికార్డు స్థాయి వీక్షణలను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ పురస్కారాల్లో నామినేషన్‌కు అర్హత సాధించింది.
ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల్లో ‘మహావతార్ నరసింహ’ ఒకటి కావడం విశేషం. ఆస్కార్ ఫైనల్ నామినేషన్ జాబితాను వచ్చే ఏడాది జనవరి 22న ప్రకటించనున్నారు. ఒకవేళ ఈ సినిమా తుది జాబితాలో చోటుదక్కించుకుంటే ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా చరిత్రకెక్కుతుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.