Shiva Devotional Song | మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ భక్తుల కోసం అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందించిన ‘ఓం భం భోలే’ భక్తిరస మ్యూజిక్ ఆల్బమ్ ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతోంది. గతంలో ‘ఏమి మాయ ప్రేమలోన’ వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్‌ను అందించిన ఈ సంస్థ, ఈసారి పరమశివుని భక్తితత్వాన్ని చాటిచెప్పేలా ఈ గీతాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. ఈ పాటలో నాగేంద్ర ఇనమడుగు, అనిల్ ఇనమడుగు, అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు మరియు అజాస్ జాన్ శివ భక్తులుగా నటించి, తమ అద్భుతమైన అభినయం మరియు వేషధారణతో ఆధ్యాత్మిక అనుభూతిని పంచారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అనిల్ ఇనుమడుగు ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. మార్క్ ప్రశాంత్ అందించిన స్వరాలు, ఆయన గాత్రం శివతత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించగా, చరణ్ పన్నాల సినిమాటోగ్రఫీ ఈ పాటను ఒక దృశ్యకావ్యంగా మలిచింది. నాగేంద్ర ఇనమడుగు నిర్మాతగా వ్యవహరించిన ఈ స్పెషల్ సాంగ్, మహాశివరాత్రి కానుకగా విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఆధ్యాత్మిక సంగీత ప్రియుల ప్లేలిస్ట్‌లో చేరిపోయింది.