Maharaja | కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ ఫీవర్.. విజయ్ సేతుపతి మహారాజ అరుదైన రికార్డు
Maharaja | విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన తాజా చిత్రం మహారాజ (Maharaja). మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా తెరకెక్కిన మహారాజ జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి వసూళ్ల విషయంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
Maharaja | కంటెంట్ నమ్మి సినిమాలు చేసే స్టార్ యాక్టర్లలో ఒకరు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం మహారాజ (Maharaja). నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా తెరకెక్కిన మహారాజ జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి వసూళ్ల విషయంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఫీవర్ కొనసాగుతున్నప్పటికీ మహారాజ రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. మహారాజ మూడో వీకెండ్లో వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం ఇండియావైడ్‌గా రూ.76 కోట్లు, ఓవర్సీస్లో రూ.24 కోట్లుగా ఈ వసూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది రూ.100 కోట్ల మార్క్ అధిగమించిన తమిళ సినిమాగా మహారాజ రికార్డుల్లోకెక్కడం విశేషం.
గత గురువారం విడుదలైన కల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ మహారాజ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుండటం విశేషం. కల్కి 2898 ఏడీ ఐదు రోజుల్లో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు మహారాజ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ గ్రాస్ సాధించిన అరణ్మనై 4ను అధిగమించడం విశేషం. ఈ హార్రర్ కామెడీ ప్రపంచవ్యాప్తంగా రూ.99 కోట్లు గ్రాస్ సాధించింది. మహారాజ లాంగ్ రన్లో రూ.105 కోట్లు వసూళ్లు చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Read also :
Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
Chiyaan Vikram | స్టన్నింగ్‌గా చియాన్ విక్రమ్ యాక్టింగ్.. తంగలాన్ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ
Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

