Vikram:మహాన్ టైటిల్‌తో వస్తున్న విక్రమ్.. ఫస్ట్ లుక్ చూసి షాక్

తమిళ స్టార్ హీరో విక్రమ్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషించారు.కరోనా సమయంలోను అన్ని జాగ్రత్తలు తీసుకొని మూవీ షూటింగ్ పూర్తి చేశారు.
ఈ యాక్షన్ డ్రామాలో ధృవ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని, అతని తండ్రి మరియు నటుడు విక్రమ్ మూడు విభిన్న గెటప్స్ లో కన్పించనున్నాడని ఇంతక ముందు వార్తలు వచ్చాయి. తాజాగా చిత్రం నుండి చియాన్ లుక్ విడుదలైంది. ‘మహాన్’అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా, ఇందులో విక్రమ్ పొడవాటి జుట్టు, గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు.
బుల్లెట్‌పై కూర్చున్న విక్రమ్ వెనకాలు కొమ్ములు, 16చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. ఈ పోస్టర్ అభిమానులకి సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్, వాణి భోజన్ , బాబీ సింహా తదితరులు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

