AK62 Movie | ‘తునివు’తో తిరుగులేని విజయాన్ని సాధించిన అజిత్.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమా కోసం వేరు దర్శకుడికి బాధ్యతలు అప్పగించేపనిలో ఉన్నాడు. ముందుగా అజిత్ తన నెక్స్ట్ సినిమాను నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే వీరిద్ధరి మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడంతో విఘ్నేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అజిత్ కొత్త దర్శకుడి వేటలో పడ్డాడు. కాగా తాజాగా అజిత్‌కు దర్శకుడు దొరికేసినట్లు తెలుస్తుంది.
తడం, కలగ తలైవన్ వంటి సినిమాలతో విషయం ఉన్న దర్శకుడిగా తమిళంలో గుర్తింపు తెచ్చుకున్నాడు మగిజ్ తిరుమేని. కాగా అజిత్ తన తదుపరి సినిమా కోసం మగిజ్ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా అజిత్, విఘ్నేష్‌తో విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కథతో సినిమా చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు అదే కథతో మగిజ్తో సినిమా చేస్తున్నాడా లేదా కొత్త కథతో వస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మగిజ్ టైర్-2 హీరోలతోనే సినిమాలు చేశాడు. కాగా మగిజ్కు స్టార్ హీరోతో తొలిసినిమా ఇదే అవుతుంది. అయితే దీనిపై పలువురు అజిత్ ఫ్యాన్స్ మగిజ్కు స్టార్ హీరోను హ్యండిల్ చేసే కెపాసిటీ ఉందా అంటే కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గతకొంత కాలంగా తమిళ బాక్సాఫీస్‌పై పట్టుకోల్పోతున్న అజిత్ తునివుతో మళ్లీ పుంజుకున్నాడు. జనవరి 11న భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి అజిత్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తునివు అందుబాటులో ఉంది.