Magadheera Movie@14 Years | తొలి సినిమా చిరుతతోనే ఓ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రామ్‌చరణ్. కమర్షియల్‌గా ఈ సినిమా పాతిక కోట్ల రేంజ్లో షేర్ కలెక్ట్ చేసి చరణ్‌కు మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళితో మగధీర చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రెండో సినిమాకే ఈ రేంజ్ హిట్ అంటే మాములు విషయం కాదు. పైగా చిరుతను ఎంత మంది ఇష్టపడ్డారో.. దానికంటే ఎక్కువే సినిమాలో చరణ్ నటనను కూడా దెబ్బి పొడిచారు. అయితే రెండో సినిమాకే నటనలో ఆ రేంజ్ వేరేయేషన్ చూపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి ఈ సినిమానే ముందు తెరకెక్కాల్సింది. కానీ రాజమౌళి.. చరణ్‌ను వేరే దర్శకుడితో లాంచ్ చేయమని చెప్పి, రెండో సినిమా చేస్తానని చిరుకు హామి ఇచ్చాడు.
ముందుగా ఈ సినిమా బడ్జెట్‌ను రూ.20 కోట్లలోపే ముగించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ నెంబర్ కాస్త డబుల్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని కాస్ట్లీయెస్ట్ సినిమాగా అప్పుడు మగధీర రికార్డులకెక్కింది. బాలీవుడ్ సైతం మగధీర బడ్జెట్‌ను చూసి ఆశ్చర్యపోయింది. ఇక తెలుగునాట అసలు అల్లు అరవింద్ అంత ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీసుకున్నాడు. నష్టాల్లోకి వెళ్లడం ఖాయమే అని ఎంతో మంది అన్నారట. కానీ అరవింద్ మాత్రం రాజమౌళిపై నమ్మకంతో డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టాడట. ఆ నమ్మకమే అల్లు అరవింద్ పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. పెట్టిన బడ్జెట్‌కు డబుల్ ఫ్రాఫిట్లను తెచ్చిపెట్టింది. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి.
ఇక ఫైనల్ రన్లో మగధీర కలెక్షన్లు చూసుకుంటే:
నైజాం : 22.20 కోట్లు
సీడెడ్ : 13.00 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.90 కోట్లు
ఈస్ట్ : 4.32 కోట్లు
వెస్ట్ : 4.13 కోట్లు
గుంటూరు : 5.18 కోట్లు
నెల్లూరు : 3.30 కోట్లు
కృష్ణా : 3.63 కోట్లు
ఏపీ+తెలంగాణ : 61.66 కోట్లు
రెస్ట్ఆఫ్ ఇండియా : 12.80 కోట్లు
ఓవర్సీస్ : 3.50 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 77.96 కోట్లు
మగధీర సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్లో ఏకంగా రూ.77.96 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి అల్లు అర్జున్‌కు కాసుల వర్షం కురిపించింది. గ్రాస్ లెక్కల్లో చూసుకుంటే రూ.140 కోట్ల రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. ఇక తెలుగులో వంద కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా మగధీర చరిత్ర సృష్టించింది.