Maestro | రిస్క్ తీసుకొని చేసిన సినిమా ఇది!

“అంధాధూన్’ బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రాగానే భయపడ్డా. కమర్షియల్ సినిమాలు చేసే సమయంలో రిస్క్ తీసుకోవడం అవసరమా అనిపించింది. నటుడిగా రిస్క్ తీసుకుంటేనే ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమాలకు న్యాయం చేయగలమని ధైర్యంగా అంగీకరించా’ అని అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ‘రీమేక్‌ను యథాతథంగా తెరకెక్కిస్తే ఉన్నది ఉన్నట్లుగానే సినిమా చేశారనే విమర్శలొస్తాయి. మార్పులు చేస్తే మూలకథను చెడగొట్టారని అంటారు. ఆ రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని మేర్లపాక గాంధీ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. చక్కటి విజువల్స్, ఆర్ఆర్ ఉన్న సినిమాను థియేటర్లో చూడలేకపోతున్నందుకు నేను, దర్శకుడు గాంధీ చాలా ఫీలవుతున్నాం. కొన్ని కారణాల వల్ల ఓటీటీలో విడుదలచేయాల్సివస్తోంది’ అని తెలిపారు. తమన్నా మాట్లాడుతూ ‘ తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ వల్లే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నా. ప్రతి అడుగులో అభిమానులు నన్ను పోత్సహిస్తూ కెరీర్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రేమకథలు, రొమాంటిక్ సినిమాల్లో నితిన్‌తో కలిసి నటించాలని అనుకున్నా. కానీ డార్క్ కామెడీ కథాంశంతో ‘మాస్ట్రో’ లాంటి భిన్నమైన సినిమా చేయడం ఆనందంగా ఉంది. స్టార్డమ్ అనేది ప్రజల ఆదరణపై ఆధారపడి ఉంటుంది. నటుడు కావడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. విభిన్నమైన కథను ఎంచుకొని నితిన్ హీరోగా వైవిధ్యతను చాటుకున్నాడు’ అని తెలిపింది. అందరికీ తాను గాయనిగానే తెలుసునని, నటిగా తనను కొత్త కోణంలో పరిచయం చేసే చిత్రమిదని మంగ్లీ చెప్పింది. ఈ కథకు సరిపోయే నటీనటులు దొరకడం చాలెంజింగ్‌గా అనిపించిందని, నితిన్‌తో పాటు ప్రతి పాత్ర గుర్తుండిపోతుందని సమర్పకుడు రాజ్‌కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘నితిన్‌తో కమర్షియల్ కామెడీ సినిమా చేయాలనుకున్నా. కానీ కథాబలమున్న ఆర్టిస్టిక్ చిత్రం చేయాల్సివచ్చింది. ఈ సినిమాతో తమన్నాపై ఉన్న మిల్కీబ్యూటీ అనే ముద్ర తొలగిపోయి గొప్ప నటి అనే పేరు వస్తుందనే నమ్మకముంది. మాతృకతో పోలికలు రావద్దనుకున్నా వస్తాయి. తిట్టడానికైనా, పొగడటానికైనా ప్రతి ఒక్కరూ సినిమాను చూడండి’ అని చెప్పారు. కెరీర్లో తాను నటించిన తొలి రీమేక్ సినిమా ఇదని నభానటేష్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

