Jani Master | పుష్ప 2 షూటింగ్లో అల్లు అర్జున్ ముందు జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు : మాధవీలత
Jani Master | లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై తెలుగు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత(Madhavilatha) సంచలన ఆరోపణలు చేసింది.
Jani Master | లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై తెలుగు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత(Madhavilatha) సంచలన ఆరోపణలు చేసింది. జానీ అనే వాడికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో జనసేన నాయకుడు నటుడు నాగబాబు కూడా ఉన్నాడు. నాగబాబు గారు మీకు కూడా ఒక కూతురు ఉంది. మీరు ఇలా మాట్లాడటం సరికాదు. మీ అమ్మాయి కంటే చిన్నపిల్ల ఇంకా ఆ అమ్మాయి. జానీ అనే వాడు మీ వరకు మంచి వ్యక్తి కావచ్చు కానీ ఆ అమ్మాయి విషయంకు వచ్చేసరికి మంచి వ్యక్తి కాడు. సాక్ష్యంగా నేనున్నాను.
పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి జానీ వచ్చి చాలా పెద్ద రచ్చ చేశాడు. ఆ షూటింగ్‌లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు!. సుకుమార్ దానికి పంచాయితీ పెట్టి క్లియర్ చేశాడు. ఈ విషయం అల్లు అర్జున్‌కు తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి బన్నీ అండగా నిలబడ్డాడు. రీసెంట్గా విశ్వక్సేన్ మూవీలో కూడా అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమెను టార్చర్ పెడుతున్నాడు. ఆ టార్చర్ భరించలేకే అతడి నుంచి దూరంగా వచ్చి సెపరేట్‌గా సినిమాలు చేసుకుంటుంది. ఎవరు అయితే జానీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరూ తప్పు చేస్తున్నట్లే. ఇప్పటికైనా మారండి అంటూ మాధవీలత వీడియో విడుదల చేసింది.
ఆమెను అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో ఉండగా జానీ మాస్టర్ కొట్టాడు!
పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్, విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్లో ఉండగా ఆ మహిళా కోరియోగ్రఫర్ను జానీ మాస్టర్ కొట్టాడు – మాధవీ లత pic.twitter.com/FSJYkjJJK7
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

