Jr NTR | మ్యాడ్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఆయన శివాని తాళ్లూరితో నిశ్చితార్థం జరగ్గా.. దేవర స్టార్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి దంపతులు సందడి చేశారు. నితిన్.. ఎన్టీఆర్కు స్వయాన బావ మరిది. లక్ష్మీప్రణతి సోదరుడు. కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబంతో పాటు కల్యాణ్ రామ్ ఫ్యామిలీ సైతం హాజరై వధూవరులను ఆశ్వీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ ప్రముఖులు సైతం వేడుకకు హాజరయ్యారు.
Man of Masses #NTR with family at #NarneNithiin engagement 💗💗
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 3, 2024
సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, నిర్మాత చినబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ తనయులతో విక్టరీ వెంకటేశ్ సరదాగా గడిపారు. ఇద్దరినీ దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నితిన్ మ్యాడ్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఇటీవల ఆయన నటించిన ఆయ్ మూవీ విడుదల విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. త్వరలోనే మ్యాడ్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Abhay Ram & Bhargava Ram ❤️ pic.twitter.com/RNFP2kConF
— Charan Chowdary (@_charan_tarak) November 3, 2024