MAA elections |చిరంజీవి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్

MAA elections | మా ఎన్నికలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు ప్రకాశ్ రాజ్ ( Prakash Raj ) , మంచు విష్ణు ( Manchu vishnu ) ఇతర మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు. తిప్పికొడితే వెయ్యి మంది కూడా లేని ఈ అసోసియేషన్ ఎన్నికలు.. ఇప్పుడు సాధారణ ఎన్నికల కంటే రసవత్తరంగా మారిపోయాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. మాటల తూటాలు పేల్చుకుంటూ మా అసోసియేషన్ ( Maa association ) పరువు దిగజారుస్తున్నారు అంటూ సీనియర్లు సీరియస్ అవుతున్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్లు.. తమ పరువు తామే తీసుకుంటున్నామని మోహన్ బాబు ( Mohan babu ) ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి సీరియస్ అయ్యాడు. చిరంజీవి ( Chiranjeevi ) కూడా క్రమశిక్షణ సంఘానికి లేఖ రాశాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి మాత్రమే పెద్దదిక్కు అని.. ఆయన కాకుండా మరెవరూ లేరు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీగా నిలిచిన ప్రకాశ్ రాజ్ ను చిరంజీవి ప్రమోట్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంచు విష్ణుకు బాలకృష్ణ, కృష్ణంరాజు సహా ఇండస్ట్రీలో మరికొందరు పెద్ద హీరోలు అండగా నిలిచారు. కానీ చిరంజీవి మాత్రం ప్రకాశ్ రాజ్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుతోనే సినీ పెద్దలు అనే పదానికి ముగింపు వచ్చేసిందని.. ప్రస్తుతం సినీ పెద్దలు అంటూ ఎవరూ లేరని మోహన్ బాబు కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
టాలీవుడ్ ( Tollywood ) పెద్దదిక్కు చిరంజీవి మాత్రమే అని ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ కొందరికి నచ్చడం లేదు. ఇది కూడా కాంట్రవర్సీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరోవైపు తాను అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే మంచు విష్ణుకు ఫోన్ చేస్తాను అని.. బిల్డింగ్ కట్టడానికి సహాయం అడుగుతాను అంటున్నాడు ప్రకాశ్ రాజ్ . మా ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయకూడదని.. మా అసోసియేషన్ ఎప్పుడూ కొన్ని కుటుంబాల ఆధీనంలోనే ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు. తనకు ఇక్కడే ఆధార్ కార్డు ఉందని.. సొంత ఇల్లు ఉందని.. అందుకే పోటీ చేస్తున్నానని అంటున్నాడు ప్రకాశ్ రాజ్. మొత్తానికి ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఈ వేడి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గేలా కనిపించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai dharam tej | హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్..
Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?
రిపబ్లిక్ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్
Maa elections | మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు : పేర్ని నాని
Ram Potineni | హీరో రామ్ పోతినేనికి గాయం
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

