MAA Elections | ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన విష్ణు
MAA Elections | ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంపై మంచు విష్ణు స్పందించారు. తనకు, ప్రకాశ్ రాజ్‌కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్లో విష్ణు షేర్ చేశారు.
‘భవిష్యత్తు కోసం మనం ఎప్పటికీ ఒకటే’ అంటూ పోస్ట్ చేశారు. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణుకు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్.. తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నిర్ణయాన్ని ఆమోదించాలని విష్ణును కోరారు. సభ్యత్వం లేకపోయినా తన సహాయం కావలసినప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. అయితే ఈ నిర్ణయంతో తాను సంతోషంగా లేనని విష్ణు తెలిపారు. గెలుపోటములు సహజమని, ఇలా భావోద్వేగంలో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రకాశ్ రాజ్‌కు వివరించారు.
For the future. We are one. Always. pic.twitter.com/1Frpl8VVpt
— Vishnu Manchu (@iVishnuManchu) October 11, 2021
తమ కుటుంబంలో ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన వ్యక్తని, ఆయన ఆలోచనల అవసరం తనకు ఉంటుందని అన్నారు. కలిసి పనిచేద్దామని చెప్పారు. అలాగే తనకు వాట్సాప్‌లో బదులివ్వొద్దని, తాను సమయం చూసుకొని స్వయంగా ప్రకాశ్ రాజ్‌ను కలిసి ఈ విషయంపై మాట్లాడతానని పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

