Sarkaru Vaari Paata | ‘సర్కారువారి పాట’ నుండి మహేషా వీడియో సాంగ్ రిలీజ్!
Mahesha Video Song | సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. సరిలేరు తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు అభిమానులను ఈ చిత్రంతో పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది.
ఈ చిత్ర విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయి. తమన్ స్వర పరిచిన అన్ని పాటలకు శ్రోతల నుండి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘మ.. మ.. మహేషా’ అనే మాస్ బీట్‌కు థియేటర్లలో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటలో మహేష్, కీర్తి సురేష్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవలే విడుదలైన మురారి వా, పెన్నీ వీడియో సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే జూన్23 నుండి ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ఈ చిత్రం ఉచితంగా అందుబాటులోకి రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

