Dulquer Salmaan | ‘సీతారామం’ (Seetharamam) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్ (LuckyBhaskar) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా జరుపుకుంది. ఇక ఈ వేడుకలో దుల్కర్ సల్మాన్‌తో పాటు, మీనాక్షి చౌదరి, నాగవంశీ, సాయిసౌజన్య పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Shoot begins for @dulQuer’s #LuckyBhaskar
A film by Venky Atluri pic.twitter.com/yGjiFzdxzk
— Haricharan Pudipeddi (@pudiharicharan) September 24, 2023
ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’ ఇదని చిత్రబృందం పేర్కొంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని, వినూత్న కథతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.