Ivana | టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న మరో మలయాళ బ్యూటీ
Love Today Actress Ivana | కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్, మాళవిక మోహనన్ వంటి కేరళ కుట్టీలు టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే మరో మలయాళ కుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
Love Today Actress Ivana aka Aleena Shaji | టాలీవుడ్లో మలయాళీ అమ్మాయిలకు మంచి డిమాండ్ ఉంది. కేరళ నుంచి వచ్చిన చాలామంది ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. ఇది కొన్నేండ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్, మాళవిక మోహనన్ వంటి కేరళ కుట్టీలు టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. దానికి తగ్గట్టే అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే మరో మలయాళ కుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు.. రీసెంట్గా లవ్ టుడే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఇవానా.
తమిళంలో రీసెంట్గా రిలీజైన లవ్‌టుడే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇద్దరు ప్రేమికులు పెండ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు వాళ్ల తల్లిదండ్రులు ఒక కండీషన్ పెడతారు. ఒకరోజు వారిద్దరూ తమ ఫోన్లను మార్చుకోవాలని సూచిస్తారు. అలా మొబైల్స్ మార్చుకున్న తర్వాత వారి జీవితాలు ఎలా మారాయనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రూ.5కోట్లతో నిర్మించిన ఈ చిత్రం తమిళనాట రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా అనువాదమై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోయిన్ ఇవానా ఇక్కడివాళ్లకు నచ్చేసింది. దీంతో ఇవానాకు టాలీవుడ్లో కూడా మంచి ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
తన అన్న కొడుకు ఆశిష్‌ను హీరోగా పరిచయం చేస్తూ రౌడీ బాయ్స్ సినిమాను తెరకెక్కించాడు దిల్ రాజు. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. కానీ ఈ సినిమా ఆశిష్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో అన్న కొడుక్కి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరో సినిమాను దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఇవానాను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇవానా 2012లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మూడు సినిమాల్లో బాల నటిగా నటించింది. ఆ తర్వాత 2018లో కోలీవుడ్లోకి వెళ్లింది. జ్యోతిక లీడ్ రోల్లో తెరకెక్కిన నాచియర్ ( తెలుగులో ఝాన్సీ) సినిమాలో కీలక పాత్ర పోషించింది. జీవీ ప్రకాశ్‌కు జోడీగా అరసి అనే పాత్రలో జీవించింది. ఈ సినిమాలో ఇవానా నటనకు ప్రశంసలు దక్కాయి. ఫిలింఫేర్, సైమా అవార్డుల కోసం నామినేట్ కూడా అయ్యింది. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ నటించిన హీరో చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తొలిసారిగా లవ్ టుడే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో తమిళంతో పాటు తెలుగులో కూడా ఇవానాకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
Read More :
foriegn actress | తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dil raju
- Ivana
- Love Today
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

