Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ ‘DC’ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి రిలీజ్?
Lokesh Kanagaraj | కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగానూ తన సత్తా చాటిన తాజా చిత్రం ‘DC’. తన విభిన్నమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్తో లోకేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Lokesh Kanagaraj | కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగానూ తన సత్తా చాటిన తాజా చిత్రం ‘DC’. తన విభిన్నమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్తో లోకేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడిగా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న లోకేష్.. హీరోగా చేసిన తొలి ప్రయత్నంలోనూ మంచి మార్కులు కొట్టేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.‘DC’ విడుదలైన తర్వాత తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్‌ను హీరోగా కొత్త కోణంలో చూడటానికి అభిమానులు ఆసక్తి చూపడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. యాక్షన్‌తో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్‌ను మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని అందుకున్నట్లు సమాచారం.
థియేటర్లలో సందడి చేసిన ‘DC’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమా కేవలం ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్లో కాకుండా రెండు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ వేదికలపై ‘DC’ స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తన సినిమాల్లో హీరోలకు పవర్ఫుల్ క్యారెక్టర్లు డిజైన్ చేసే లోకేష్ కనగరాజ్.. ఈసారి స్వయంగా హీరోగా మారి ప్రేక్షకులను పలకరించడం అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. దర్శకుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్‌కు తోడు, హీరోగా కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది.తెలుగు ప్రేక్షకుల్లో కూడా లోకేష్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ‘DC’ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన అభిమానులు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. యాక్షన్ కథకు తగ్గట్టుగా ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు టాక్. అనిరుధ్ సంగీతం మరోసారి సినిమాపై అంచనాలను పెంచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- DC
- kamal hassan
- Khaidi-2
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

