Leo Movie | సరిగ్గా ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న లియోపై జనాల్లో మాములు అంచనాల్లేవు. అప్పుడే ఓవర్సీస్లో టిక్కెట్లు విచ్చలవిడిగా తెగుతున్నాయి. తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పోటీగా రెండు తెలుగు సినిమాలున్నా.. లోకేష్ క్రేజ్‌తో తెలుగులో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అందులోనూ రామ్‌చరణ్ ఉన్నట్లు రూమర్ రావడంతో లియోపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. ఎలాగో ఫ్రీగా ప్రమోషన్ వస్తుందనుకున్నారో ఏమో కానీ.. దీనిపై టీమ్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో లోకేష్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నాడు.
కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయపెట్టాడు. ఈ సినిమాలో ఫస్ట్ పది నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దని.. సినిమాకు సోల్ అదేనని చెప్పుకొచ్చాడు. ఇక లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’లో భాగంగా సినిమా తెరకెక్కున్నట్లు వార్తలు రావడంతో లియోపై ఎక్కడలేని హైప్ పెరిగింది. దానికి తోడు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సైతం మిలియన్లలో వ్యూస్‌ను సాధించి.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తులో జరపాలని చూస్తున్నారట. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగులో డబ్ అయిన కొన్ని తమిళ సినిమాలు ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్ చేసి సినిమాపై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై వీర లెవల్లో బిజినెస్ జరుగుతుంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం టాలీవుడ్ ట్రేడ్‌నే ఆశ్చర్యపరిచింది. పైగా పోటీగా భగవంత్ కేసరీ, టైగర్ నాగేశ్వరరావు వంటి భారీ సినిమాలు ఉండగా ఆ రేటు పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి.