Liger collections | విజయ్ దేవరకొండ ( Vijay devarakonda ) లాంటి క్రేజీ హీరో సినిమా విడుదలైతే కలెక్షన్స్ ఎలా రావాలి.. టాక్ ఎలా ఉన్నా సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ అయితే రావాల్సిందే. కానీ లైగర్ సినిమాకు అలాంటివేం జరగడం లేదు. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఎంతగా అంటే ఇప్పుడు తెలుగులో భారీ నష్టాలు తీసుకొచ్చిన సినిమాలలో ఇది ముందు వరుసలో నిలిచేలా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కేవలం 12.45 కోట్లు వచ్చాయి. తెలుగులోనే 60 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని అమ్మారు నిర్మాతలు. ఇక్కడ సేఫ్ అవ్వాలన్నా ఇంకా 47 కోట్లు రావాల్సిందే. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రానికి డిజాస్టర్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం.
నైజాం: 5.56 కోట్లు
సీడెడ్: 1.81 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.71 కోట్లు
ఈస్ట్: 0.86 కోట్లు
వెస్ట్: 0.55 కోట్లు
గుంటూరు: 0.99 కోట్లు
కృష్ణా: 0.68 కోట్లు
నెల్లూరు: 0.53 కోట్లు
ఏపీ, తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్: 12.70 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 1.48 కోట్లు
మిగిలిన భాషలు: 0.80 కోట్లు
హిందీ: 6.30 కోట్లు
ఓవర్సీస్: 3.30 కోట్లు
వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్: 24.45 కోట్లు
లైగర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు అమ్మారు. ఈ సినిమా సేఫ్ కావాలంటే అక్షరాల 100 కోట్లు రావాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం 30 కోట్ల మార్కు అందుకునేలా కనిపించడం లేదు విజయ్ దేవరకొండ సినిమా. ఈ నేపథ్యంలో సినిమా భారీ డిజాస్టర్ గా మిగలడం ఖాయం అయిపోయింది.
ఇవి కూడా చదవండి..