Vijay Sethupathi | ‘జవాన్’ సినిమా కోసం విజయ్ సేతుపతి షాకింగ్ రెమ్యునరేషన్
Vijay Sethupathi Remuneration | ఒక వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటిస్తూ విలక్షన నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించికున్నాడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే నిడివి ఎంత అని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఉప్పెన సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో ఈయన పండించిన విలనిజంకు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇక ఇటీవలే విడుదలైన విక్రమ్లోనూ సంతానం పాత్రలో జీవించేశాడు. ప్రస్తుతం ఈయన షారుఖ్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న జవాన్లో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ షూట్లో కూడా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
జవాన్ సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి విజయ సేతుపతి భారీగా పారితోషికాన్ని అందుకుంటున్నట్లు టాక్. ఇప్పటివరకు విజయ్ సేతుపతి ప్రతి సినిమాకు రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అయితే జవాన్ చిత్రం కోసం ఏకంగా రూ.21 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఇండియాలోనే హైయెస్ట్ పేయిడ్ విలన్గా విజయ్ సేతుపతి అరుదైన ఘనతను సాధించినట్టే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో షారుఖ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో భాగమవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

