Thalapathy Vijay | లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన దళపతి విజయ్.. వామ్మో ధర అన్ని కోట్లా?
Thalapathy Vijay Bought New Apartment | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటుడు దళపతి విజయ్. తుపాకి సినిమాతో తెలుగులో ఈయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఇటీవలే ఈయన నటించిన బీస్ట్ విడుదలై ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం విజయ్, వంశీపైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ చెన్నైలో ఓ ఖరిదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు టాక్.
విజయ్ ప్రస్తుతం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉంటున్నాడు. అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో వేరే ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. చెన్నైలో దాదాపు రూ.35 కోట్లతో ఓ లగ్జరీయస్ అపార్ట్మెంట్ కొనుకున్నాడట. అంతేకాకుండా తన ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుందట. ఇక ప్రముఖ హీరో ఆర్య కూడా ఆ కాంప్లెక్స్‌లోనే అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. ఇక విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్‌తో మరో సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

