AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. కెనడా మార్ఖమ్ నగరంలో ఒక వీధి పేరును ఏఆర్ రెహమాన్‌గా మార్చింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా రెహమాన్ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, కెనడాలో వీధికి సంగీత దర్శకుడి పేరు పెట్టడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2013లో ఏఆర్ రెహమాన్ పేరుపెట్టారు.
ఈ స్వర మాంత్రికుడి పాటలకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. సంగీత కచేరీలకు దేశ విదేశాలలో విశేష ఆదరణ లభిస్తుంటుంది. కెనడాలో ఏఆర్ రెహమాన్‌కు కెనడాలో మంచి ఆదరణ ఉన్నది. ఏఆర్ రెహమాన్ తమిళంలో కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందుదు కాడు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించగా.. చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.