లావణ్య త్రిపాఠీ, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాతలు. నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు.
రితేష్ రానా దర్శకుడు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు. హ్యూమరస్‌గా ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంది. కేంద్రమంత్రి పాత్రలో వెన్నెల కిషోర్ డైలాగ్స్, నాయిక లావణ్య పోల్ డాన్స్, సత్య మేకోవర్‌తో మెప్పించారు. జూలై 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం : కాలభైరవ, ఫైట్స్ : శంకర్ ఉయ్యాల, సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం