Sathi Leelavathi | అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) 2022లో నటించిన హ్యాపీ బర్త్ డే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయిందని తెలిసిందే. మంచి హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్న ఈ భామ తాజాగా సతీలీలావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. చాలా రోజులకు సరికొత్త అప్డేట్ అందించింది లావణ్య త్రిపాఠి టీం. సతీలీలావతి ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి షెడ్యూల్లో హీరోహీరోయిన్లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ ముగించి.. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలియయజేశారు.
మేకర్స్ ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో సాగనుందంటున్నారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్బాబు ఎం, రాజేష్.టి నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
What an absolute pleasure it has been working on this project! This one is really going to crack people up! https://t.co/vwVdKMX5R9
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) February 19, 2025
MAD Square | ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
Kamal Haasan | త్రిషతోనే కాదు ఆమె కుమార్తెతోనూ సినిమా స్కూల్‌కు వెళ్తా : కమల్ హాసన్
Sundeep Kishan | పీపుల్స్ స్టార్ ట్యాగ్‌పై వివాదం.. స్పందించిన నటుడు సందీప్ కిషన్