Lakshmi Manchu | కుటుంబంలో గొడవల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మి
Lakshmi Manchu | మంచు కుటుంబంలో విభేదాలు సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి (Lakshmi Manchu) పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Lakshmi Manchu | మంచు కుటుంబంలో విభేదాలు సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని రోజులూ గుట్టుగా సాగిన ఇంటి గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఈ క్రమంలో రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై (journalists) మోహన్ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. దాడి అనంతరం మోహన్ బాబు సైతం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి (Lakshmi Manchu) పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తన ఫిట్నెస్, డైలీ రొటీన్, కుమార్తెకు సంబంధించిన విశేషాలను మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా తన కుమార్తె నిర్వాణ చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంటే.. మంచు లక్ష్మి మాత్రం ఇన్‌స్టాలో బిజీగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read..
journalists | మోహన్ బాబు ఉన్మాదిలా దాడి చేశారు.. జర్నలిస్టుల ఆగ్రహం
Mohan Babu | మోహన్‌బాబు స్థిమితంగా లేరు.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
Manchu Vishnu | కుటుంబ వివాదంపై స్పందించిన మంచు విష్ణు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

