ఇద్దరిలో ఎవరి పంతం నెగ్గింది?
ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకున్న ఓ రాజకీయనాయకుడు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకుంటానని పంతం పట్టిన ఓ పోలీస్ అధికారి. ఎన్నికలకు పాతికరోజులే సమయం ఉంది.
ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకున్న ఓ రాజకీయనాయకుడు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకుంటానని పంతం పట్టిన ఓ పోలీస్ అధికారి. ఎన్నికలకు పాతికరోజులే సమయం ఉంది. తక్కువ సమయంలో వందకోట్ల డబ్బుని, రెండు లక్షలమంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున పంచడం రాజకీయనాయకుడి టార్గెట్. మరి ఆ టార్గెట్‌ని రీచ్ అయ్యాడా? పోలీస్ అధికారి పంతం ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కుతున్న రాజకీయ వ్యంగ్యం చిత్రం ‘లక్ష్మీకటాక్షం’.
సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వినయ్, అరుణ్, దీప్తి వర్మ కీలక పాత్రధారులు. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తంరెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానుగుణంగా ఈ ట్రైలర్లో ఎన్నికల వేడిని చూపించారు.
ప్రస్తుతం తెలుగురాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల తేదీనే ఈ ట్రైలర్లోనూ చూపిస్తూ, పాతికేళ్ల కెరీర్ నిలబెట్టుకోవాలని తపించే రాజకీయవేత్తగా సాయికుమార్ కనిపించారు. ఈ ట్రైలర్లో కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉండటం గమనార్హం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. చరిష్మా శ్రీకర్, హరిప్రసాద్, సాయికిరణ్ ఏడిద, ఆమని తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నని ఐనవెల్లి, సంగీతం: అభిషేక్ రుఫుస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

