Laapataa Ladies | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) కాపీ చేసి తీశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై చిత్ర రచయిత బిప్లాబ్ గోస్వామి (Biplab Goswami) స్పందించాడు. తాను ఏ సినిమాను కాపీ కొట్టలేదంటూ లేఖను విడుదల చేశాడు.
బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన ఈ సినిమాకు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) దర్శకత్వం వహించింది. శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా నితాన్షి గోయల్, ప్రతిభ రంట హీరోయిన్లుగా నటించారు. భోజ్పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ఈ సినిమా ఒరిజినల్ కాదని తాజాగా విమర్శలు వచ్చాయి. అరబిక్ సినిమా అయిన ‘బుర్ఖా సిటీ’ (Burqa City) చిత్రాన్ని ‘లాపతా లేడీస్’ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై చిత్ర రచయిత బిప్లాబ్ గోస్వామి (Biplab Goswami) స్పందించాడు. తాను ఏ సినిమాను కాపీ కొట్టలేదంటూ లేఖను విడుదల చేశాడు.
“లాపతా లేడీస్ష చిత్రం కాపీ అంటూ వస్తున్న వార్తలు అబద్దం. ఈ సినిమా స్టోరీని చాలా ఏండ్ల క్రితమే రాసుకున్నట్లు తెలిపాడు. 2014లో టూ బ్రైడ్స్ అనే పేరుతో ఈ కథను తాను రిజిస్టర్ చేసుకున్నట్లు బిప్లబ్ గోస్వామి వెల్లడించాడు. లాపతా లేడిస్లోని కథ, పాత్రలు, సంభాషణలు 100 శాతం ఒరిజినల్ అని, కాపీ కొట్టామంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు మా శ్రమకు ఫలితం లేకుండా చేస్తాయి. నాకే కాదు, నా టీమ్ మొత్తం చేసిన కృషిని దెబ్బ తీస్తాయి అని రచయిత బిప్లాబ్ సోషల్ మీడియాలో చెప్పుకోచ్చాడు.