Oscars: లాపతా లేడీస్ ఔట్.. ఆస్కార్స్ రేసులో సంతోష్
Oscar Race: ఆస్కార్స్ రేసు నుంచి లాపతా లేడీస్ చిత్రం మిస్సైంది. 15 చిత్రాల షార్ట్‌లిస్టును బుధవారం అకాడమీ ప్రకటించింది. అయితే ఆ లిస్టులో బ్రిటన్ నుంచి హిందీ చిత్రం సంతోష్ చోటు దక్కించుకున్నది.
లాస్ ఏంజిల్స్: ఆస్కార్స్ రేసు(Oscars) నుంచి హిందీ చిత్రం లాపతా లేడీస్ ఔటైంది. 97వ అకాడమీ అవార్డుల కోసం భారత్ నుంచి బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ క్యాటగిరీలో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా తుది జాబితా నుంచి తప్పుకున్నది. కిరణ్ రావు డైరెక్షన్ చేసిన ఈ ఫిల్మ్‌కు ఆస్కార్స్ షార్ట్‌లిస్టులో చోటు దక్కలేదు. 15 చిత్రాల షార్ట్‌లిస్టు నుంచి అయిదింటిని తుది రేసుకు ఎంపిక చేస్తారు. అయితే 15 చిత్రాల లిస్టును బుధవారం అకాడమీ ప్రకటించింది. లాపతా లేడీస్ ఆ లిస్టులో లేకున్నా.. ఇండియాకు చెందిన ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన సంతోష్ అనే చిత్రానికి షార్ట్‌లిస్టులో చోటు దక్కింది. ఈ ఫిల్మ్‌లో ఇండియన్ స్టార్స్ షాహనా గోస్వామి, సునితా రాజ్వార్ నటించారు. అయితే ఈ ఫిల్మ్ యూకే తరపున ఆస్కార్స్‌కు ఎంట్రీ ఇచ్చింది.
ఎమిలియా పెరిజ్(ఫ్రాన్స్), ఐయామ్ స్టిల్ హియర్(బ్రెజిల్), యునివర్సల్ ల్యాంగ్వేజ్(కెనడా), వేవ్స్(చెక్ రిపబ్లిక్), ద గర్ల్ విత్ ద నీడిల్(డెన్మార్క్), ద సీడ్ ఆప్ ద సాక్రెడ్ ఫిగ్(జర్మనీ), టచ్(ఐస్‌ల్యాండ్), నీక్యాప్(ఐర్లాండ్), వెర్మిగ్లో(ఇటలీ),ఫ్లో(లత్వియా), ఆర్మండ్(నార్వే), ఫ్రమ్ గ్రౌండ్ జీరో(పాలస్తీనా), దహోమే(సెనిగల్), హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్మా డైస్(థాయిలాండ్) చిత్రాలు ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో పోటీపడుతున్నాయి. జనవరి 17వ తేదీన తుది ఆస్కార్ నామినేషన్లు ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

